ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి

ABN, First Publish Date - 2021-01-26T06:10:00+05:30

గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై బీఎల్‌వోలు అవగాహన కల్పించాలని ఆర్డీవో జె.సీతారామారావు సూచించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో సీతారామారావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి ఆర్డీవో సీతారామారావు


తుమ్మపాల, జనవరి 25: గ్రామాల్లో ఓటు హక్కు వినియోగంపై బీఎల్‌వోలు అవగాహన కల్పించాలని ఆర్డీవో జె.సీతారామారావు సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో సోమవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా బీఎల్‌వోలతో కలిసి అధికారులు అవగాహన ర్యాలీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, ఓటు హక్కు పొందడం కంటే వినియోగించుకోవడం గొప్ప అని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసరావు, జోనల్‌ కమిషనర్‌ శ్రీరామ్మూర్తి, ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, డిప్యూటీ తహ సీల్దార్‌ వెంకట్‌ పాల్గొన్నారు. అలాగే డైట్‌ కళాశాలలో సోమవారం జరిగిన కార్యక్రమంలో డీటీ లీలాకుమారికి విద్యార్థులు ఓటరు నమోదు ఫారాలను నింపి అందజేశారు. 


కశింకోటలో...

కశింకోట: మండల కేంద్రంలో సోమవారం సీనియర్‌ ఓటరు పాలూరి బంగారుశెట్టి (78)ని తహసీల్దారు బి.సుధాకర్‌ సత్కరించారు. ఈ సందర్భంగా ఓటు ప్రాముఖ్యతను తెలుపుతూ ర్యాలీ జరిపారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ శేషు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-01-26T06:10:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising