ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆటోవాలాల నడ్డి విరుస్తున్నారు

ABN, First Publish Date - 2021-02-28T06:37:20+05:30

కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, సెస్‌, వ్యాట్‌ పన్నులను వెంటనే రద్దు చేయాలని ఆటో, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్‌ చేశారు.

నరసింహనగర్‌ రోడ్డులో ధర్నా చేస్తున్న ఆటో వాలాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెట్రో వాతతో నిత్యం ఇబ్బందులు

తక్షణం ధరలు తగ్గించాలని  ధర్నా

అక్కయ్యపాలెం, ఫిబ్రవరి 27: కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచిన డీజిల్‌, పెట్రోల్‌, సెస్‌, వ్యాట్‌ పన్నులను వెంటనే రద్దు చేయాలని ఆటో, మోటార్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వామనమూర్తి డిమాండ్‌ చేశారు. నరసింహనగర్‌ రైతుబజార్‌ రోడ్డులో శనివారం ఆటో డ్రైవర్లు  ధర్నా నిర్వహించారు. ఈ ఆందోళనకు హాజరైన వామనమూర్తి మాట్లాడుతూ బీజేపీ, వైసీపీలు పోటీపడి డీజిల్‌, పెట్రోల్‌, వంట గ్యాస్‌లపై వ్యాట్‌, సెస్‌ పెంచి ఆటోవాలాల నడ్డివిరుస్తున్నానన్నారు.


ఆటోడ్రైవర్లు జీవనోపాధి కోల్పోయి, అప్పులతో బతుకుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో నోరు విప్పాల్సిన ప్రజాప్రతినిధులు మౌనం వహిస్తున్నార న్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు తమ తీరు మార్చుకోకుంటే ప్రజాగ్రహా నికి గురికాక తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో రావికృష్ణ, సాయికుమార్‌, శ్రీనివాసరావు, నరసింగరావు, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-28T06:37:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising