ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్‌ టీచింగ్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

ABN, First Publish Date - 2021-07-27T06:12:06+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

సమావేశంలో పాల్గొన్న అసోసియేషన్‌ ప్రతినిధులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏయూ క్యాంపస్‌, జూలై 26: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎస్సీ, ఎస్టీ, బీసీ-సీ నాన్‌ టీచింగ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గాన్ని సోమవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏయూ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో మాజీ అధ్యక్షుడు ఎం.ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అసోసియేషన్‌ నూతన గౌరవాధ్యక్షుడిగా కె.అప్పలనారాయణ, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా సీహెచ్‌ థామస్‌, ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులుగా మాడుగల భాస్కరరావు, సీహెచ్‌ సుబ్రహ్మణం, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఉత్తరాల గిరిబాబు, సహాయ కార్యదర్శిగా చెన్నా రామకృష్ణ, కోశాధికారిగా బి.రామకృష్ణలు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలు చేశారు. అసోసియేషన్‌కు సొంత భవనం ఏర్పాటు చేయాలని, నాన్‌ టీచింగ్‌లో కారుణ్య నియామకాలు చేపట్టాలని, వివిధ కారణాల వల్ల ఉద్యోగాల నుంచి తొలగించిన ఉద్యోగాలను విధుల్లోకి తీసుకోవాలని తీర్మానించారు. ఈ సమావేశంలో నాయకులు రమణ, జంగా త్రిమూర్తులు, చెన్నా అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-27T06:12:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising