ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏయూ ఇంజనీరింగ్‌ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2021-07-16T05:36:16+05:30

ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్టు వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు.

పరీక్ష ఫలితాలను విడుదల చేస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాలుగు రోజుల్లో విడుదల చేయడం రికార్డు: వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, జూలై 15: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ నాలుగో సంవత్సరం మొదటి సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్టు వీసీ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఏయూ అకడమిక్‌ సెనేట్‌ మందిరంలో పరీక్షల ఫలితాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12తో ఈ పరీక్షలు ముగియగా, కేవలం నాలుగు రోజుల్లో మూల్యాంకనం చేసి ఫలితాలను విడుదల చేశామన్నారు. ఏయూ చరిత్రలో తొలిసారిగా అతి తక్కువ సమయంలో పరీక్ష ఫలితాలను అందించడం సాధ్యపడిందన్నారు. రానున్న రోజుల్లోనూ పరీక్షలు ముగిసిన వారం రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసే దిశగా వ్యవస్థను రూపొందించడం జరుగుతోందన్నారు. కాగా ఫస్టియర్‌ సెమిస్టర్‌ ఫలితాల కోసం ఏయూ వెబ్‌సైట్‌ను సంప్రతించాలన్నారు.  ఈ కార్యక్రమంలో రెక్టార్‌ సమత, రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌, పీజీ పరీక్షల డీన్‌ రవీంద్రబాబు, ప్రొఫెసర్లు రమాసుధ, లలితాభాస్కరి, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-07-16T05:36:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising