ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అట్టహాసంగా ఆడారి ఆనంద్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-01-21T06:01:31+05:30

వైసీపీ నేత, విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు పట్టణంలో బుధవారం అట్టహాసంగా జరిగాయి.

ఆనంద్‌ను గజమాలతో సత్కరిస్తున్న వెంకట్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

    ఆఖరి శ్వాస వరకు ప్రజా సేవకే అంకితమన్న నేత

 ఎలమంచిలి, జనవరి 20 : వైసీపీ నేత, విశాఖ డెయిరీ వైస్‌ చైర్మన్‌ ఆడారి ఆనంద్‌ కుమార్‌ జన్మదిన వేడుకలు పట్టణంలో బుధవారం అట్టహాసంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు, విశాఖ డెయిరీ డైక్టర్లు, సిబ్బంది, మునిసిపల్‌ మాజీ కౌన్సిలర్లు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజల సమక్షంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఆడారి వెంకట్‌ ఆధ్వర్యంలో అభిమానులు పెద్ద ఎత్తున పట్టణంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆడారి వెంకట్‌ మిత్రమండలి, పెదపల్లి నేతలు, నక్కపల్లి, ఎస్‌.రాయవరం ప్రాంతాల నుంచి వచ్చిన వారంతా ఆయనను గజమాలలతో సత్కరించారు.  గౌరీపరమేశ్వరి సహకార పొదుపు సంఘం ప్రతినిధులు, ఆడారి వెంకట్‌, ఆడారి శ్రీధర్‌, దాడి కృష్ణ, మార్కెట్‌ కమిటీ మాజీ డైరెక్టర్‌ ములంపాక నానాజీ తదితరులు పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా వేదపండితుల సమక్షంలో అగ్నిహోమం నిర్వహించారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ఆనంద్‌ ప్రారంభించగా, పలువురు రక్తదానం చేశారు. ఉచిత నేత్ర, ఆయుర్వేద శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్‌ మాట్లాడుతూ తన ఆఖరి శ్వాస ఉన్నంత వరకూ ప్రజా సేవకే అంకితమవుతానని స్పష్టం చేశారు. గవర కార్పొరేషన్‌ చైర్మన్‌ బొడ్డేడ ప్రసాద్‌ మాట్లాడుతూ సేవలకు మారుపేరు ఆడారి తులసీరావు కుటుంబీకులన్నారు. డెయిరీ డైరెక్టర్లు రెడ్డి రామకృష్ణ, గేదెల సత్యనారాయణ, పిళ్లా రమాకుమారిలు మాట్లాడుతూ డెయిరీ చైర్మన్‌గా 35 ఏళ్లపాటు తులసీరావు కొనసాగారంటే ఆయన సేవలకు ఇదే నిదర్శనమన్నారు. అనంతరం ఆనంద్‌ పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి, అన్నదానం చేశారు.  నేతలు పలివెల అమృతవల్లి, పిట్టా శ్రీనులతో పాటు మళ్ల కన్నారావు, యల్లపు నాగరాజు, బెజవాడ వెంకటరమణ, నగిరెడ్డి కాసుబాబు, కె.అప్పలనాయుడు, బొడ్డేడ సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-21T06:01:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising