ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్యాలయాలపై దాడులు అమానుషం

ABN, First Publish Date - 2021-10-21T06:43:29+05:30

టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమని నాయకులు పేర్కొన్నారు.

పీలా గోవింద్‌ను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనకాపల్లి బంద్‌లో టీడీపీ నాయకులు

మాజీ ఎమ్మెల్సీ బుద్ద, మాజీ ఎమ్మెల్యే పీలా అరెస్టు

అనకాపల్లి, అక్టోబరు 20: టీడీపీ కార్యాలయాలపై దాడులు చేయడం అమానుషమని నాయకులు పేర్కొన్నారు. టీడీపీ రాష్ట్ర వ్యాప్త బంద్‌లో భాగంగా అనకాపల్లిలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఆర్టీసీ బస్సులు ఆపేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ముందుగా నెహ్రూచౌక్‌కు చేరుకున్న మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగ జగదీశ్వరరావు తన అనుచరులతో కలసి ఆర్టీసీ బస్సును ఆపి దాని ముందు బైఠాయించారు. అక్కడే ఉన్న పట్టణ సీఐ ఎల్‌ భాస్కరరావు సిబ్బందితో సహా వచ్చి జగదీశ్‌ను బలవంతంగా లాక్కెల్లి కూరగాయల వాహనంలో ఎక్కించి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పీలా తన అనుచరులతో వచ్చి నెహ్రూచౌక్‌ జంక్షన్‌లో నిరసన తెలిపి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో వారు మాట్లాడుతూ,  గతంలో ఎన్నడూ లేని విధంగా టీడీపీ నాయకుల ఇళ్లపైనా, కార్యాలయాలపైనా దాడులు చేయడం అమానుషమన్నారు. 


కబడ్దార్‌ అమర్‌: మాజీ ఎమ్మెల్సీ బుద్ద

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ దుర్భాషలాడడంపై మాజీ ఎమ్మెల్యే బుద్ద నాగజగదీశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీయుజం మిందికి పరిమితం చేసుకోవాలని, టీడీపీ కార్యకర్తపై చేయి పడితే అనకాపల్లిలో అడుగుపెట్టలేవని హెచ్చరించారు. పెద్ద వారిని తిడితే మంత్రి పదవి వస్తుందనుకుంటే భ్రమ అవుతుందని, సంస్కారం లేని మాటలు సరికాదని పేర్కొన్నారు. కాగా, బంద్‌లో భాగంగా 25 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నాయకులు మళ్ల సురేంద్ర, కొణతాల శ్రీనివాసరావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పచ్చికూర రాము, బీఎస్‌ఎంకే జోగినాయుడు, ఆడారి మంజు, కొణతాల రత్నకుమారి, సబ్బవరపు గణేశ్‌, పొలిమేర నాయుడు, పిట్ల రాజు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T06:43:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising