ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంచగ్రామాల భూ సమస్యపై అశోక్‌ తన వైఖరి తెలపాలి

ABN, First Publish Date - 2021-06-20T05:42:11+05:30

సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

ఆలయంలో మంత్రి ముత్తంశెట్టి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు 

సింహాచలం, జూన్‌ 19: సింహాచలం పంచగ్రామాల భూ సమస్యపై దేవస్థానం పాలక మండలి చైర్మన్‌ పూసపాటి అశోక్‌గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం పంచగ్రామాల భూ సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధితో ఉందని, ఇందులో భాగంగానే ప్రభుత్వ అభిప్రాయాన్ని, దేవస్థానం నష్ట పరిహారం వంటి పలు అంశాలను కోర్టుకు నివేదించడం జరిగిందన్నారు. ఎంతోమంది ఇబ్బందులకు గురవుతున్న పంచగ్రామాల భూ సమస్యపై అశోక్‌గజపతిరాజు తన వైఖరిని స్పష్టం చేయడం ద్వారా సహకరించాలన్నారు. గడిచిన ఐదేళ్లలో భీమిలి నియోజవర్గ పరిధిలో 200 ఎకరాలను విక్రయించిన సంగతి వాస్తవామా, కాదా అని ప్రశ్నించారు. అశోక్‌గజపతిరాజుకు భయపడే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదన్నారు. కాగా మంత్రికి ఈవో సూర్యకళ ఆహ్వానం పలకడంతో పాటు దర్శనానంతరం స్వామివారి ప్రసాదాలను అందజేశారు. మంత్రి వెంట ట్రస్టీ సూరిశెట్టి సూరిబాబు, వైసీపీ నాయకులు ఎర్ర వరంబాబు, నడింపల్లి రామరాజు, ఉన్నారు.


Updated Date - 2021-06-20T05:42:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising