ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇన్నోవేషన్‌ హబ్‌గా ఏపీ

ABN, First Publish Date - 2021-12-01T06:37:27+05:30

ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాస్కామ్‌ నెలకొల్పిన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.

ఆస్పత్రిలో రోగులకు సేవలందిస్తూ, వారి హెల్త్‌ రిపోర్టులను కూడా అప్‌డేట్‌ చేసే రోబోను పరిశీలిస్తున్న రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కేంద్రం ప్రారంభ కార్యక్రమంలో పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి గౌతంరెడ్డి

త్వరలో అమెజాన్‌ తరపున మరో సెంటర్‌ ఏర్పాటు


విశాఖపట్నం, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్‌ హబ్‌గా మారనుందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నాస్కామ్‌ నెలకొల్పిన ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌’ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. అనంతరం వైవీఎస్‌ మూర్తి ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడుతూ, ఈ కేంద్రంలో ఐఓటీ, మెషిన్‌ లెర్నింగ్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బ్లాక్‌ చెయిన్‌, సైబర్‌ సెక్యూరిటీ వంటి తొమ్మిది రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు జరుగుతాయని, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారని వెల్లడించారు. విశాఖపట్నంలోని మెడ్‌టెక్‌ జోన్‌ విజయవంతంగా నడుస్తోందని, అది కోహినూర్‌ వజ్రంలా విశిష్టతను సంతరించుకుందన్నారు. త్వరలో అమెజాన్‌ తరఫున మరో ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు.  ఏపీ ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టుగా చేపట్టిన ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’పై దేశమంతా ఆసక్తి చూపుతోందని చెప్పారు. ఈ సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వర్చువల్‌ విధానంలో కేంద్ర ఐటీ శాఖా మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్‌ ప్రకాశ్‌ సహానీ, నాస్కామ్‌ అధ్యక్షురాలు దేబ్‌జానీ ఘోష్‌, రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, ఏయూ వీసీ ప్రసాదరెడ్డి, విశాఖ జెడ్పీ చైర్‌పర్సన్‌ సుభద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:37:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising