ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోట్ల ఆస్తిని వేలకోట్లకు అమ్మేస్తారా?

ABN, First Publish Date - 2021-02-27T04:40:49+05:30

ఆంధ్రులు ఆత్మగౌరవ పోరాటంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలని కేంద్రం చూస్తే ఊరుకోమని ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులు హెచ్చరించారు.

నిరసన తెలియజేస్తున్న ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే చూస్తూ ఊరుకోం

ఏపీ ఎన్‌జీవో సంఘం నాయకుల హెచ్చరిక

మహారాణిపేట, ఫిబ్రవరి 26: ఆంధ్రులు ఆత్మగౌరవ పోరాటంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలని కేంద్రం చూస్తే ఊరుకోమని ఏపీ ఎన్‌జీఓ సంఘం నాయకులు హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్రం యోచనను వ్యతిరేకిస్తూ  విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌లోని ఎన్‌జీవో భవన్‌ ఎదుట భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు మాట్లాడుతూ కర్మాగారానికి సొంత గనులు కేటాయించి ఊపిరి పోయాల్సిన కేంద్రం కార్పొరేట్‌ సంస్థలకు కారు చౌకగా కట్టబెట్టాలని చూడడం దారుణమన్నారు. రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన కర్మాగారాన్ని 4,850 కోట్లకు కారుచౌకగా ప్రైవేటు పరం చేయాలనుకోవడం ప్రజాధనాన్ని దోచిపెట్టడమేనని విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు క్రమబద్ధీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు డి.రమేష్‌బాబు, వి.ఆర్‌.వి.సత్యనారాయణ, వై.నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-02-27T04:40:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising