ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటి నుంచి మరో 300 పడకలు

ABN, First Publish Date - 2021-05-09T05:11:35+05:30

విశాఖపట్నంలో కరోనా రోగుల కోసం మరో 300 పడకలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి.

పడకల కోసం ఏర్పాట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షీలానగర్‌లో చకచకా ఏర్పాట్లు

విశాఖపట్నం, మే 8(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో కరోనా రోగుల కోసం మరో 300 పడకలు సోమవారం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు షీలానగర్‌లోని వికాస్‌ కాలేజీలో జరుగుతున్నాయి. నగరంలో కరోనా బాధితుల సంఖ్య భారీగా పెరుగుతుండటం, అందుకు తగిన సంఖ్యలో ఆస్పత్రుల్లో పడకలు లభించకపోవడంతో ఎంపీ విజయ సాయిరెడ్డి తాత్కాలిక పడకల ఏర్పాటుపై దృష్టి సారించారు. తన ప్రగతి భారతి చారిటబుల్‌ ట్రస్టు తరఫున నగరంలోని దాతల సాయంతో ఇక్కడ అన్నీ సమకూరుస్తున్నారు. కరోనా రోగులకు  ఆక్సిజన్‌ పడకలు ఇక్కడ లభిస్తాయి. 104కి ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకున్న కొవిడ్‌ పాజిటివ్‌ బాధితులకు మాత్రమే ఇక్కడ పడకలు కేటాయిస్తారు. ఇక్కడి ఏర్పాట్లను శనివారం సాయంత్రం మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయ సాయిరెడ్డి పరిశీలించారు. జీవీఎంసీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో అన్ని అంశాలపై చర్చించారు. 


Updated Date - 2021-05-09T05:11:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising