ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లాలో మరో 2 థియేటర్లు మూత

ABN, First Publish Date - 2021-12-26T06:06:24+05:30

జిల్లాలో మరో రెండు సినిమా థియేటర్లు మూతపడ్డాయి.

విశాఖ జిల్లా సబ్బవరంలో మూసివేసిన ఎస్‌టీబీఎల్‌ థియేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సబ్బవరంలో ఎస్‌టీబీఎల్‌, రావికమతంలో శ్రీవెంకటేశ్వర...

రావికమతం/సబ్బవరం, డిసెంబరు 25: జిల్లాలో మరో రెండు సినిమా థియేటర్లు మూతపడ్డాయి. మండల కేంద్రమైన రావికమతంలో శ్రీవెంకటేశ్వర  థియేటర్‌ను యాజమాన్యం స్వచ్ఛందంగా హాలును మూసివేసింది. ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్‌ ధరలతో నడపలేమనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పెద్ద సినిమాలకు కూడా టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వకపోవడం, సదుపాయాలపై ఇటీవల కాలంలో అధికారులు తరచుగా తనిఖీలు నిర్వహిస్తుండడం కారణంగానే థియేటర్‌ను యాజమాన్యం మూసివేసినట్టు చెబుతున్నారు. అలాగే సబ్బవరంలోని ఎస్‌టీబీఎల్‌ సినిమా థియేటర్‌ను యాజమాన్యం శనివారం మూసివేసింది. ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్నట్టు టిక్కెట్లు విక్రయిస్తే నష్టాలపాలవుతామని, అందుకే థియేటర్‌ను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్టు యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.

Updated Date - 2021-12-26T06:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising