ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుండెపోటుతో ఆంధ్రజ్యోతి విలేకరి మృతి

ABN, First Publish Date - 2021-04-19T05:23:58+05:30

కె.కోటపాడు మండలానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు (ఆంధ్రజ్యోతి), చోడవరం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాలి రాజశేఖర్‌ (38) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు.

గాలి రాజశేఖర్‌ (ఫైల్‌ ఫొటో)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  

మాడుగుల, ఏప్రిల్‌ 18: కె.కోటపాడు మండలానికి చెందిన సీనియర్‌ పాత్రికేయుడు (ఆంధ్రజ్యోతి), చోడవరం ఏపీయూడబ్ల్యూజే ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు గాలి రాజశేఖర్‌ (38) ఆదివారం గుండెపోటుతో మృతిచెందారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన ఆయన ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. మందులు తీసుకుంటూ ఇంటివద్దనే చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఇంటి మేడపై నుంచి కిందకు దిగుతుండగా కళ్లు తిరిగి పడి పోయారు. ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సన్నద్ధం అవుతుండగా ప్రాణాలు కోల్పోయారు. రాజశేఖర్‌కి తల్లిదండ్రులతోపాటు భార్య స్వరూప, ఇద్దరు కుమార్తెలు  శ్రావ్యశ్రీ (11), భవ్యశ్రీ (8) ఉన్నారు. రాజశేఖర్‌ మృతిపట్ల పలువురు పాత్రికేయులు, రాజకీయ పార్టీల నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేసి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

 

Updated Date - 2021-04-19T05:23:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising