ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడు సీఎంని చూసి జగన్ నేర్చుకోవాలి: అచ్చెన్న

ABN, First Publish Date - 2021-05-14T18:12:16+05:30

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, ఇప్పటికే కరోనా మహమ్మారివల్ల 9, 10 వేల మంది చనిపోతే ముఖ్యమంత్రి ఏం చేశారని ప్రశ్నించారు. ఇంత జరిగినా సీఎం బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని, కరోనాతో సహజీవనం చేయాలని నీతిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న వ్యవసాయశాఖ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాస్క్ లేకుండా కనిపించారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఒక్క జగన్‌కు తప్ప అందరికీ మాస్క్ ఉందని అన్నారు. తమిళనాడులో సినీ పరిశ్రమకు సంబంధించినవారు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు చెక్కు ఇవ్వడానికి వెళితే.. సీఎం మాస్క్ పెట్టుకుని బాధ్యతగా వ్యవహరించారన్నారు. స్టాలిన్‌ను చూసి జగన్ నేర్చుకోవాలన్నారు.


ఏపీ రాష్ట్రంలో కనీసం పేదలకు భోజనం పెట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్నా క్యాంటిన్లు పెట్టామని, రూ. 5లకే పేదలకు భోజనం అందించామన్నారు. ఈ ప్రభుత్వం అన్నా క్యాంటిన్లు అలాగే కొనసాగించితే పేదలు భోజనం చేసేవారన్నారు. సీఎం జగన్ అన్నా క్యాంటిన్లను మూసివేసి పేదలకు అన్నం లేకుండా చేశారని మండిపడ్డారు. అన్నా క్యాంటిన్ పేరు ఇష్టం లేకపోతే కనీసం వైఎస్ పేరుమీద అయినా ఆ క్యాంటిన్లు కొనసాగిస్తే బాగుండేదని అన్నారు. రాష్ట్రంలో విధ్వంసం తప్ప అభివృద్ధి లేదని అచ్చెన్నాయుడు విమర్శించారు.

Updated Date - 2021-05-14T18:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising