ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్కాగా ప్రాదేశిక ఓట్ల లెక్కింపు

ABN, First Publish Date - 2021-09-18T05:55:57+05:30

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టాలని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సిబ్బందికి సూచించారు.

గొలుగొండలో అధికారులకు సూచనలిస్తున్న ఆర్డీవో గోవిందరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గొలుగొండ/ నర్సీపట్నం అర్బన్‌, సెప్టెంబరు 17 : ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నిర్వహించిన ఓట్ల లెక్కింపును పక్కాగా చేపట్టాలని నర్సీపట్నం ఆర్డీవో గోవిందరావు సిబ్బందికి సూచించారు. గొలుగొండలో బ్యాలెట్‌ బాక్స్‌లు భద్రపర్చిన స్ట్రాంగ్‌ రూమ్‌, లెక్కింపు కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. సిబ్బందితో మాట్లా డుతూ ఆదివారం ఓట్ల లెక్కింపు జరుగుతుం దన్నారు. నిబంధనల ప్రకారం అంతా నడుచుకోవాలని సూచిం చారు.  అనంతరం మండల ఎన్నికల రిటర్నింగ్‌ ఆఫీసర్‌ గోపీకుమార్‌ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులతో సమావేశమయ్యారు. కౌంటింగ్‌కు ఏజెం ట్లుగా హాజరు కానున్నవారు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకు న్నట్టు ధ్రుపత్రాలను విధిగా సమర్పించాలన్నారు. లెక్కింపు కేంద్రం వద్ద 144వ సెక్షన్‌ అమలులో ఉంటుందని, నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌, ఎస్‌ఐ ధనుంజయనాయుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు పాల్గొన్నారు. ఇదిలావుంటే, నర్సీపట్నం ఎంపీడీవో కార్యాలయంలో సిబ్బందికి కౌంటింగ్‌పై ఎన్నికల అధికారి ఎన్‌.సరోజిని శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్‌ పక్కాగా సాగాలన్నారు.  ఇం దుకు సంబంధించి పెదబొడ్డేపల్లి డాన్‌బాస్కొ కళాశాలలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తహసీల్దార్‌ జయ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-18T05:55:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising