ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొనసాగుతున్న తొలగింపుల పర్వం

ABN, First Publish Date - 2021-10-20T06:32:31+05:30

నగరంలో తొలగింపుల పర్వం కొనసాగుతోంది. రుషికొండలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఎదురుగా రూ.కోట్లు వెచ్చించినిర్మించిన బస్‌షెల్టర్‌ను మంగళవారం సాయంత్రం తొలగించే పనులు చేపట్టారు.

బస్‌షెల్టర్‌ను తొలగిస్తున్న జెసిబి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాగర్‌నగర్‌, అక్టోబరు 19: నగరంలో తొలగింపుల పర్వం కొనసాగుతోంది. రుషికొండలో గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఎదురుగా రూ.కోట్లు  వెచ్చించినిర్మించిన బస్‌షెల్టర్‌ను మంగళవారం  సాయంత్రం  తొలగించే పనులు చేపట్టారు. రుషికొండ పర్యాటకాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న హరిత రిసార్ట్స్‌ను తొలగించి ఆస్థానంలో కొత్తగా భారీ రిసార్ట్స్‌ నిర్మించేందుకు ప్రభుత్వం డీఈసీ సంస్థకు బాధ్యతను అప్పగించింది. ఆసంస్థ బీచ్‌రోడ్డులో ఫుట్‌పాత్‌లను సైతం వదలడం లేదు. రూ.కోట్లు వెచ్చించి కార్పొరేట్‌ తరహాలో గీతం ఎదురుగా నిర్మించిన బస్‌షెల్టర్‌ను తొలగిస్తున్నారు. దీనిని పర్యాటకులు, గీతం, గాయత్రీ తదితర విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు వినియోగిస్తుంటారు. ఎండ, వానల నుంచి రక్షణ కల్పిస్తున్న బస్‌షెల్టర్‌ను తొలగించడమేమిటని స్థానికులు విమర్శిస్తున్నారు.  


Updated Date - 2021-10-20T06:32:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising