ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఉక్కు’ ప్రైవేటీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలి

ABN, First Publish Date - 2021-05-17T04:27:56+05:30

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్‌ చేశారు.

దీక్షా శిబిరంలో నినాదాలు చేస్తున్న నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు 

సిరిపురం, మే 16: స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా త్వరలో జరిగే అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు శ్రీనివాసరాజు డిమాండ్‌ చేశారు. అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాటికి 45వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తమతో పాటు ఉద్యమంలో పాల్గొంటున్నాయన్నారు. గతంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చినట్టుగా అసెంబ్లీలో స్టీల్‌ ప్లాంట్‌పై తీర్మానం చేస్తే తమ ఉద్యమానికి మరింత బలం చేకూరుతుందన్నారు. మహారాష్ట్రలో ఉండే పోస్కో స్టీల్‌ కంపెనీ ఎందుకు ఆక్సిజన్‌ ఇవ్వలేదని, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ఆక్సిజన్‌ ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్టీల్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ అధ్యక్షుడు జి.శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ, నాయకులు ఎన్‌.కృష్ణ, వరహాలు, రమణ, రాముడు, రాజు, అప్పలరాజు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-05-17T04:27:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising