ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నం బరిలో 78 మంది

ABN, First Publish Date - 2021-03-04T06:47:06+05:30

స్థానిక మునిసిపాలిటీలో 28 వార్డులకు 78 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 181 నామినేషన్లు దాఖలు కాగా...పరిశీలనలో 26 నామినేషన్లను అధికారులు తిరస్క రించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ, వైసీపీ అన్ని వార్డుల్లో పోటీ

బీజేపీ/జనసేన 11 వార్డులకే పరిమితం

అధికార పార్టీకి ఐదు వార్డుల్లో రెబెల్స్‌ బెడద

12 వార్డుల్లో ముఖాముఖి పోటీ

పోటీలో మాజీ మంత్రి అయ్యన్న భార్య, కుమారుడు


నర్సీపట్నం, మార్చి 3: స్థానిక మునిసిపాలిటీలో 28 వార్డులకు 78 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 181 నామినేషన్లు దాఖలు కాగా...పరిశీలనలో 26 నామినేషన్లను అధికారులు తిరస్క రించారు. మిగిలిన 155 మందిలో మంగళ, బుధవారాల్లో 77 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీడీపీ, వైసీపీ అన్ని వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ ఎనిమిది వార్డులు, ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన మూడు వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. 12 వార్డుల్లో (4, 5, 7, 17 నుంచి 24 వరకు, 28) టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య ముఖాముఖి పోటీ నెలకొంది. 11 వార్డుల్లో (1, 2, 8, 9, 11, 13, 14, 16, 25, 26, 27) త్రిముఖ పోటీ, నాలుగు వార్డుల్లో (3, 6, 10, 12) చతుర్ముఖ పోటీ జరుగుతున్నది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు భార్య పద్మావతి 26వ వార్డులో, రెండో కుమారుడు రాజేశ్‌ 25వ వార్డులో పోటీ చేస్తున్నారు. వైసీపీకి ఐదు వార్డుల్లో (1, 2, 3, 14, 15) రెబల్స్‌ ఉన్నారు.

Updated Date - 2021-03-04T06:47:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising