ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాత్కాలిక రైతుబజార్లలో 697 స్టాల్స్‌

ABN, First Publish Date - 2021-05-10T04:42:36+05:30

రైతుబజార్లకు జనాలు పోటెత్తుతుండడంతో వాటిని తాత్కాలికంగా మరో చోటుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.89.44 లక్షలతో జీవీఎంసీ ఏర్పాట్లు



విశాఖపట్నం, మే 9 (ఆంధ్రజ్యోతి): రైతుబజార్లకు జనాలు పోటెత్తుతుండడంతో  వాటిని తాత్కాలికంగా మరో చోటుకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నగర పరిధిలోని రైతుబజార్లకు అనుబంధంగా స్టాల్స్‌ను ఏర్పాటుచేసే పనిలో జీవీఎంసీ అధికారులు నిమగ్నమయ్యారు. నగర పరిఽధిలోని 45 రైతుబజార్లకు అనుబంధంగా రూ.89.44 లక్షలతో 697 స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. జోన్‌-1లో మూడు రైతుబజార్లు ఉండగా వాటికి అనుబంధంగా 30 స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. జోన్‌-2 పరిధిలో ఏడు రైతుబజార్లకు 72 స్టాల్స్‌,  జోన్‌-3 పరిధిలో ఏడు రైతుబజార్ల పరిధిలో 94 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. జోన్‌-4 పరిధిలో ఆరు రైతుబజార్లు ఉండగా ఎనిమిది స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. జోన్‌-5 పరిధిలో ఏడు రైతుబజార్లు ఉండగా 118 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. జోన్‌-6 పరిధిలో ఏడు రైతుబజార్లు ఉండగా 110 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. జోన్‌-7 ఒక రైతు బజార్‌ పరిధిలో 220 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. జోన్‌-8 పరిఽధిలో ఏడు రైతుబజార్లు ఉండగా 45 స్టాల్స్‌ను ఏర్పాటుచేశారు. వీటిలో ఇప్పటికే పలుచోట్ల స్టాల్స్‌ ఏర్పాటు పూర్తికాగా మిగిలినవన్నీ సోమవారం నాటికి అందుబాటులోకి రానున్నాయని జీవీఎంసీ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావు తెలిపారు. 


Updated Date - 2021-05-10T04:42:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising