ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,829 గ్రూపులకు రూ.47,54,317 సున్నా వడ్డీ

ABN, First Publish Date - 2021-04-24T04:29:12+05:30

సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు. వెలుగు కార్యాలయంలో శుక్రవారం వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి నియోజకవర్గ పరిధిలోని ఆరుమండలాల్లో 2,829 స్వయం సహాయక సంఘాలకు రూ.47,54,317 వడ్డీ చెక్కును మహిళలకు అందించారు.

చెక్కును పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే, సర్పంచ్‌, అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళలకు చెక్కును అందించిన ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ 

అరకులోయ, ఏప్రిల్‌ 23: సంక్షేమ పథకాలు విజయవంతంగా  అమలుచేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ అన్నారు.  వెలుగు  కార్యాలయంలో శుక్రవారం వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకానికి సంబంధించి నియోజకవర్గ పరిధిలోని ఆరుమండలాల్లో 2,829 స్వయం సహాయక సంఘాలకు రూ.47,54,317 వడ్డీ  చెక్కును మహిళలకు అందించారు. వెలుగు డీపీఏం సత్యంనాయుడు, ఏపీఏం అప్పాయమ్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ ఈ పథకంతో మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. అనంతగిరి మండల పరిధిలో 561 సంఘాలకు రూ.11,95,137, అరకులోయ 537 సంఘాలకు రూ.12,00,250, డుంబ్రిగుడ 468 సంఘాలకు 5,73,901, హుకుంపేట 342 సంఘాలకు రూ.5,59,704, పెదబయలు 504  సంఘాలకు 9,06,053, ముంచంగిపుట్టు 417 సంఘాలకు రూ.3,19,222 సున్నా వడ్డీ కింద నగదు జమ చేశామన్నారు. కార్యక్రమంలో పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబు, అరకులోయ ఏంపీడీవో రాంబాబు, ఐదు మండలాల ఏపీఏంలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-24T04:29:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising