ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

1.99 లక్షల మందికి చేయూత

ABN, First Publish Date - 2021-06-23T05:47:23+05:30

‘వైఎస్‌ఆర్‌ చేయూత’ పథకం కింద జిల్లాలో 1,99,695 మంది లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున బ్యాంకు ఖాతాలకు రూ.374 కోట్లు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు రూ.18,750 చొప్పున జమ 


మహారాణిపేట, జూన్‌ 22: ‘వైఎస్‌ఆర్‌ చేయూత’ పథకం కింద జిల్లాలో 1,99,695 మంది లబ్ధిదారులకు రూ.18,750 చొప్పున బ్యాంకు ఖాతాలకు రూ.374 కోట్లు జమ అయ్యాయని జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ తెలిపారు. ఈ పథకం రెండో విడత నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ జిల్లాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జీవీఎంసీ పరిధిలో 63,134 మందికి రూ.118,37,62,500 లబ్ధి చేకూరిందని వివరించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 18,583 మందికి, ఎస్టీ కార్పొరేషన్‌ ద్వారా 28,811 మందికి, బీసీ కార్పొరేషన్‌ ద్వారా 1,48,810 మందికి, మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా 3,491 మంది లబ్ధిదారులకు చేయూత పథకాన్ని అందించామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు జి.అమర్‌నాథ్‌, కరణం ధర్మశ్రీ, నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్‌ బి.శ్రీధర్‌, జీవీఎంసీ కమిషనర్‌ జి.సృజన తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T05:47:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising