ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నర్సీపట్నం సబ్‌డివిజన్‌లో 1,813 ఎకరాల్లో నీటమునిగిన వరి

ABN, First Publish Date - 2021-09-29T05:45:26+05:30

తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో నర్సీపట్నం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 1,813 ఎకరాల్లో వరి, 35 ఎకరాల్లో చెరకు పంటలు నీటి మునిగినట్టు గుర్తించామని వ్యవసాయ శాఖ ఏడీ వంగపండు మోహనరావు తెలిపారు.

బలిఘట్టం వద్ద నీట మునిగిన వరి పొలాలను పరిశీలిస్తున్న ఏడీ రామ్మోహనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడీ వంగపండు మోహనరావు వెల్లడి


నర్సీపట్నం, సెప్టెంబరు 28 : తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో నర్సీపట్నం సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఐదు మండలాల్లో 1,813 ఎకరాల్లో వరి, 35 ఎకరాల్లో చెరకు పంటలు నీటి మునిగినట్టు గుర్తించామని వ్యవసాయ శాఖ ఏడీ వంగపండు మోహనరావు తెలిపారు. ఆయన మంగళవారం నర్సీపట్నం మండలంలో పలు గ్రామాల్లో నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నర్సీపట్నం మండలంలో 14 గ్రామాల్లో 275 మంది రైతులకు సంబంధించి 264 ఎకరాలు, గొలుగొండలో 9 గ్రామాల్లో 112 మంది రైతులకు చెందిన 120 ఎకరాలు, రోలుగుంట మండలంలో 30 గ్రామాల్లో 1,043 మంది రైతులకు చెందిన 591 ఎకరాలు, రావికమతం మండలంలో 6 గ్రామాల్లో 207 రైతులకు చెందిన 263 ఎకరాలు, వి.మాడుగుల మండలంలో 17 గ్రామాల్లో 822 రైతులకు చెందిన 575 ఎకరాల్లో వరితోపాటు 35 ఎకరాల్లో చెరకు పంట నీటి మునిగాయని చెప్పారు. పొలాల్లో అదనపు నీటిని బయటకు పంపితే పంట నష్టం వాటిల్లదని, ఈ మేరకు రైతులకు సూచనలు చేశామని ఆయన తెలిపారు.


Updated Date - 2021-09-29T05:45:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising