ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో మైనింగ్ మాఫియా.. లక్షల్లో లంచాలు.. ఈజీగా అనుమతులు

ABN, First Publish Date - 2021-03-07T17:25:39+05:30

నగరంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇప్పటికే పరిపాలనా రాజధానిగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: నగరంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇప్పటికే పరిపాలనా రాజధానిగా విశాఖను ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో మైనింగ్ మాఫియా అక్రమాలకు హద్దూపద్దు లేకుండా పోతోంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన ఆడియోలు బయటపడ్డాయి. మైనింగ్ సిబ్బంది చేతులు తడిపితే చాలు.. అనుమతులు లభిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ అధికారి, దళారి మధ్య జరిగిన సంభాషణ దీనికి ఉదాహరణగా నిలుస్తోంది. లక్షల్లో లంచాలు వసూలు అవుతున్నా... ఫిర్యాదు చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.  


మైనింగ్ శాఖకు చెందిన ప్రతాప్ రెడ్డి అనే అధికారి అక్రమార్కులపై దృష్టి పెట్టారు. దళారులను బెంబేలెత్తిస్తున్నారు. ఆయన పేరు చెబితే చాలు దళారులు, అక్రమార్కులు హడలెత్తిపోతున్నారట. దీంతో వారు... మైనింగ్ శాఖ సిబ్బంది చేతులు తడుపుతూ తమ పనులు కానిచ్చుకుంటున్నారు. లక్షల్లో వసూలు చేస్తున్నారని తాజా ఆడియో సంభాషణ రుజువు చేస్తోంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండే ఏసీబీ... దీనిపై ఏం చేస్తోందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. లక్షల్లో చేతులు మారుతున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

Updated Date - 2021-03-07T17:25:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising