ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెళ్లిళ్ల సీజన్‌.. బంగారం షాపులకు కరోనా ఎఫెక్ట్..

ABN, First Publish Date - 2021-05-12T21:32:06+05:30

విశాఖ: ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్.. ఈ సమయంలో బంగారం షాపులు కళకళలాడాలి.. కానీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ: ఇప్పుడంతా పెళ్లిళ్ల సీజన్.. ఈ సమయంలో బంగారం షాపులు కళకళలాడాలి.. మార్కెట్లన్నీ కస్టమర్స్‌తో సందడిగా ఉండాలి. కానీ కరోనా పుణ్యమా అని సీన్ రివర్స్ అయింది. గోల్డ్, వెండి వస్తువులు కొనుగోలు చేసే కస్టమర్లు లేక బంగారం షాపులన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ సందర్భంగా బంగారం షాపు నిర్వాహకులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అంతా అస్తవ్యస్థమైందన్నారు. మే, జూన్ పెళ్లిళ్ల సీజన్ అని, వ్యాపారం బాగా జరుగుతుందని అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ రావడం.. దీంతో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ప్రభుత్వం లాక్ డౌన్ పెట్టడంతో ఉన్న నాలుగు గంటల్లో కస్టమర్లు వస్తారా? అని ఎదురు చూడడం జరుగుతోందన్నారు. 


కరోనా నేపథ్యంలో పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారని, దీంతో వ్యాపారం పూర్తిగా పడిపోయిందని బంగారం షాపు నిర్వాహకులు వాపోయారు. ప్రస్తుత పరిస్థితిలో బంగారం, వెండి వస్తువులు కొనుక్కుందామనే ఆలోచన జనాల్లో లేదన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం బంగారం షాపులపై తీవ్రంగా పడిందని, అమ్మకాలు, కొనుగోళ్లు పడిపోయాయన్నారు. ఇదే వ్యాపారంపై ఆధారపడి పనిచేస్తున్న చాలా మందికి ఉపాధి లేకుండా పోయిందని, అలాంటివారిని ప్రభుత్వం ఆదుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Updated Date - 2021-05-12T21:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising