ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విగ్రహాల ధ్వంసం నుంచి ఉత్సవాలపై ఆంక్షలు వరకు వచ్చారా?

ABN, First Publish Date - 2021-09-09T01:08:35+05:30

విగ్రహాల ధ్వంసం నుంచి ఉత్సవాలపై ఆంక్షలు వరకు వచ్చారా?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిషేధిస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని  పలు హిందూ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు వ్యతికిరేకించాయి. అంతేకాదు ఆందోళన వ్యక్తం చేశాయి. మరోవైపు వినాయక చవితి ఉత్సవాలపై బుధవారం మధ్యాహ్నం ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలయింది. ప్రైవేటు స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మతపరమైన కార్యక్రమాలను నిరోధించే హక్కులేదని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని కోర్టు సూచించింది.


పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు సమర్థించింది. ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. 


ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ‘విగ్రహాల ధ్వంసం నుంచి ఉత్సవాలపై ఆంక్షలు వరకు వచ్చారా?. వినాయక ఉత్సవాలపైనా జగన్ సర్కార్ ఎందుకు నిషేధం విధించింది?. హిందువుల మనోభావాలను పదే పదే ప్రభుత్వం ఎందుకు పరీక్షిస్తోంది?. రాజకీయ ఆర్భాటాలకు అడ్డురాని కోవిడ్ నిబంధనలు గణనాథుడికే అడ్డొస్తాయా?. అసలు ప్రతి మేజర్ ఉత్సవాలను జగన్ ఎందుకు వివాదాస్పదం చేస్తున్నారు?.’’ అనే అంశాపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 



Updated Date - 2021-09-09T01:08:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising