ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోంది: విజయసాయి

ABN, First Publish Date - 2021-07-18T22:25:48+05:30

కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోంది: విజయసాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహారిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.  శరద్ యాదవ్ విషయంలో నోటీసులు ఇచ్చి.. వారం రోజుల్లోనే అనర్హత వేటు వేశారని చెప్పారు. వైసీపీ.. ఏడాది క్రితం అనర్హత పిటిషన్ ఇస్తే... 11 నెలల తర్వాత స్పీకర్ నిద్ర లేచారని చెప్పారు. ఉద్దేశ్య పూర్వకంగా కాలయాపన చేస్తూ... కొద్దీ రోజుల క్రితం పిటిషన్‌లో లోపాలు ఉన్నాయి సరి చేయమని పంపారని పేర్కొన్నారు. అనర్హత పిటిషన్‌కు సంబంధించి సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందన్నారు. ఆ మార్గదర్శకాల ప్రకారం చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరామన్నారు. మూడు నుంచి ఆరు నెలల కాలంలోనే ఎదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పినా... బీజేపీకి అనుకూలంగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారని విజయసాయి మండిపడ్డారు. ఇది చాలా దుర్మార్గమైనదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరి, ద్వంద్వ ప్రమాణాలు మార్చుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం‌పై చూపుతున్న సవతి తల్లి ప్రేమను, మొండి చేయి చూపడాన్ని, ద్వంద్వ ప్రమాణాలను మానుకోవాలని స్పష్టంగా చెప్పామన్నారు. ప్రధాని ఆవాస యోజన కింద.. మౌలిక సదుపాయాల కల్పనకు 11వేల కోట్లు రాష్ట్రానికి కేటాయించాలని కోరామని తెలిపారు.  

Updated Date - 2021-07-18T22:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising