ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కార్లతో ఢీకొట్టి..గొడ్డళ్లతో నరికి

ABN, First Publish Date - 2021-06-18T07:55:04+05:30

సోదరుడి కర్మకాండ కోసం వెళుతుండగా.. కార్లతో ఢీకొట్టారు. గాయాలతో కిందపడ్డవారిపై పడి వేటకోడవళ్లు, గొడ్డళ్లతో నరికి.. నరికి.. చంపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరు టీడీపీ నేతల దారుణ హత్య

ప్రాణాలు తీసిన ‘పంచాయతీ’ పోటీ

మృతులిద్దరూ అన్నదమ్ములు

మరో సోదరుడి కర్మకాండ కోసం వెళ్తుండగా దారి కాచి నరికివేత


గడివేముల, జూన్‌ 17: సోదరుడి కర్మకాండ కోసం వెళుతుండగా.. కార్లతో ఢీకొట్టారు. గాయాలతో కిందపడ్డవారిపై పడి వేటకోడవళ్లు, గొడ్డళ్లతో నరికి.. నరికి.. చంపారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం పెసరవాయి గ్రామంలో ఇద్దరు టీడీపీ నాయకులను ఇలా అతి క్రూరంగా హత్యచేశారు. రాజకీయ ప్రత్యర్థుల కత్తులకు బలైన వీరిద్దరూ సొంత అన్నదమ్ములే. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. తెలుగుదేశం నాయకులు వడ్డు ప్రతా్‌పరెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డిల సోదరుడు మోహన్‌రెడ్డి మూడు రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. మూడునాళ్ల మెతుకులు (కర్మకాండ) సమాధి వద్ద వేసేందుకు గురువారం ఉదయం ఆరు గంటలకు వడ్డు ప్రతా్‌పరెడ్డి, వడ్డు నాగేశ్వర్‌రెడ్డి శ్మశాన వాటికకు బయలు దేరారు. ముందే పసిగట్టిన ప్రత్యర్థులు.. పక్కాగా ప్రణాళిక రూపొందించుకున్నారు. గ్రామానికి చెందిన శ్రీకాంతరెడ్డి, రాజారెడ్డి, ఎల్లారెడ్డి అనే వైసీపీ నాయకులు తమ అనుచరులతో రెండు కార్లతో అక్కడకు వచ్చారు. శ్మశానం సమీపంలో వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతా్‌పరెడ్డి, వారి బంధువులపైకి  కార్లను దూకించారు. దీంతో వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. తేరుకునేలోపే ప్రత్యర్థులు వేటకొడవళ్లు, గొడ్డళ్లతో విరుచుకుపడ్డారు. కిందపడ్డ వడ్డు నాగేశ్వర్‌రెడ్డి, వడ్డు ప్రతా్‌పరెడ్డిపై విచక్షణారహితంగా దాడి చేశారు.


ఈ దాడిలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. వారి వెంట ఉన్న మరికొందరికి కత్తి గాయాలయ్యాయి. కాగా, పంచాయతీ ఎన్నికల్లో వడ్డు బ్రదర్స్‌ పోటీపెట్టడమే వారి ప్రాణాలు తీసిందని చెబుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికలు ఈ వర్గాల మధ్య మరింత మంటపెట్టాయి. అప్పటినుంచి వారికి రాజారెడ్డి, శ్రీకాంతరెడ్డి తదితర వైసీపీ నేతల నుంచి ముప్పు ఏర్పడిందని చెబుతున్నారు. శ్రీకాంతరెడ్డి, ఎల్లారెడ్డి, రాజారెడ్డి సహా 10 మందిపై ప్రతా్‌పరెడ్డి భార్య వడ్డు లక్ష్మీదేవమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీధర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T07:55:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising