ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు డిప్యూటీలు!

ABN, First Publish Date - 2021-03-17T08:58:54+05:30

రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకునే విధానం అమల్లోకి రానుంది. ఈ విధానానికి సంబంధించి ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మున్సిపాలిటీల్లోనూ ఇద్దరేసి వైస్‌ చైర్మన్‌లు

త్వరలో గవర్నర్‌కు ఆర్డినెన్స్‌: మంత్రి పెద్దిరెడ్డి

రెండో పోస్టుపై సప్లిమెంటరీ నోటిఫికేషన్‌

రేపు మేయర్‌/చైర్‌పర్సన్‌ ఎన్నిక


అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇద్దరేసి డిప్యూటీ మేయర్లు, వైస్‌ చైర్మన్లను ఎన్నుకునే విధానం అమల్లోకి రానుంది. ఈ విధానానికి సంబంధించి ఆర్డినెన్స్‌ తీసుకురానున్నట్లు పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఆర్డినెన్స్‌ను త్వరలో గవర్నర్‌ ఆమోదానికి పంపి.. ఆమోదం తీసుకున్నాక రెండో డిప్యూటీ మేయర్‌, రెండో వైస్‌ చైర్మన్‌ ఎన్నిక నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 18న మున్సిపాలిటీల్లో చైర్మన్‌/వై్‌స చైర్మన్‌.. నగరపాలక సంస్థల్లో మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు నిర్వహిస్తామని.. రెండో వైస్‌చైర్మన్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక కోసం తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ ఇస్తామని ప్రకటించారు.


మంగళవారమిక్కడ సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ తీరును హైకోర్టు తప్పు పట్టిందన్నారు. సుప్రీంకోర్టుకు తానే సమర్పించిన అఫిడవిట్‌కే వ్యతిరేకంగా ఆయన వ్యవహరించారని.. చంద్రబాబు, కమిషనర్‌ కలిసి.. ఏకగ్రీవాలకు వక్రభాష్యాలు చెప్పారని ఆరోపించారు. ఏకగ్రీవాలు జరిగిన చోట్ల డిక్లరేషన్లు ఇవ్వాలని కోర్టు ఆదేశించినందున.. పరిషత్‌ ఎన్నికల ప్రక్రియను కొనసాగించడానికి ఆరు రోజుల సమయం సరిపోతుందని, ఈ నెలాఖరులోగా ఈ ఎన్నికలు కూడా జరిపి, నిమ్మగడ్డ పదవీ విరమణ చేస్తే బాగుంటుందని మంత్రి అన్నారు. పరిషత్‌ ఎన్నికలను కూడా నిర్వహించేస్తే.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిపాలనపై దృష్టి సారించడానికి వీలవుతుందని, కరోనా వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టవచ్చని చెప్పారు. స్థానిక ఎన్నికల తర్వాత జగన్‌ మార్కు పాలన రాష్ట్రంలో కనిపిస్తుందని పేర్కొన్నారు.


తిరుపతిలో మూడు లక్షల మెజార్టీ వస్తుంది: పెద్ది రెడ్డి

తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్‌ గురుమూర్తి పేరును జగన్‌ ఖరారు చేరారని, మార్పు చేర్పులుంటే ఆయన్నే అడగాలని విలేకరులతో పెద్దిరెడ్డి అన్నారు. అయినా జగన్‌ ఒకసారి నిర్ణయం తీసుకున్నాక, మార్పు ఉండదన్నారు. తిరుపతిలో వైసీపీ 3 లక్షల మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  గెలుపుపై ఇతర పార్టీలు ఆశలు పెట్టుకోవద్దన్నారు. హిందూత్వం ఎజెండాగా బీజేపీ మత రాజకీయాలు చేయడం తగదని.. సుందరీకరణ పేరుతో విజయవాడలో వందల గుళ్లను చంద్రబాబు కూలగొడితే ఏం చేశారని ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే, 3 నెలల్లో కొత్త రథం ఏర్పాటు, ఇతర ఆలయాల్లో దాడుల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుందన్నారు. ఎన్నికలు, రాజకీయాల కోసం ఆలయాలపై దాడులను ప్రతిపక్షం వక్రీకరించిందని ఆరోపించారు. చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం సీఐడీ పెండింగ్‌ కేసులో భాగమని, ఆరోపణ వస్తే విచారణ చేయకుండా ఎలాగని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-03-17T08:58:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising