ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Good News: భారీగా తగ్గిన tomato ధరలు

ABN, First Publish Date - 2021-11-27T20:06:46+05:30

టమోటా కొనాలంటేనే భయపడిపోతున్న సామాన్య ప్రజలకు నిజంగా ఇది శుభవార్త. నిన్న మొన్నటి వరకు వంద రూపాయలకు పైగా ధర పలికిన టమోటా ఒక్కసారిగా పడిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: టమోటా కొనాలంటేనే భయపడిపోతున్న సామాన్య ప్రజలకు నిజంగా ఇది శుభవార్త. నిన్న మొన్నటి వరకు వంద రూపాయలకు పైగా ధర పలికిన టమోటా ఒక్కసారిగా పడిపోయింది. కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌లో శనివారం టమోటా ధర గరిష్టంగా రూ. 27 పలకగా, కనిష్టంగా రూ. 10 పలకడం విశేషం. ఒక్కసారిగా టమోటా ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత ధరలకు రవాణా ఖర్చులు కూడా రావడం కష్టమేనని చెబుతున్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి టమోటా దిగుమతి కావడం వల్ల ధరలు తగ్గాయని పత్తికొండ వ్యాపారులు చెబుతున్నారు. అయితే కర్నూలు జిల్లాలోని పలు మార్కెట్లలో టమోటా ధర రూ. 50కిపైగానే పలుకుతోంది. కానీ పత్తికొండ మార్కెట్ యార్డులో ఊహించని విధంగా ధరలు తగ్గడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వ్యాపారులు పత్తికొండలో ధరలు తగ్గించి ఇతర ప్రాంతాల్లో అధిక రేట్లకు అమ్ముకునేందుకు పన్నాగం పన్నినట్లు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-11-27T20:06:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising