ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజిస్ర్టేషన్ల శాఖలో టోల్‌ఫ్రీ!

ABN, First Publish Date - 2021-01-18T08:36:22+05:30

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ శాఖలో అవినీతి నియంత్రణకు ఆ శాఖ పలు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అవినీతి నియంత్రణకు మరో మార్గం


అమరావతి, జనవరి 17(ఆంధ్రజ్యోతి): స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్స్‌ శాఖలో అవినీతి నియంత్రణకు ఆ శాఖ పలు కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. డాక్యుమెంట్ల రిజిస్ర్టేషన్‌ సమయంలో ఎక్కడైనా అవినీతి జరిగితే.. నేరుగా ఫోన్‌చేసి ఫిర్యాదు చేసేందుకు ఒక టోల్‌ఫ్రీ నెంబరును అందుబాటులోకి తీసుకురావాలని ఉన్నతాధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. అదేసమయంలో ఏదైనా సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయం, సబ్‌ రిజిస్ర్టార్‌పై ఆరోపణలు వచ్చినప్పుడు.. అతని పరిధిలో జరిగిన రిజిస్ర్టేషన్లపై సంబంధిత వ్యక్తులకు ఫోన్లు చేసి విచారణ జరిపే విధానం ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు.


పరిస్థితిని బట్టి ఈ రెండింటిలో ఏదో ఒక విధానాన్ని అమలుచేయాలని అనుకుంటున్నారు. తరచూ రిజిస్ర్టేషన్‌ చేయించుకున్న పార్టీలతో ఇలా ర్యాండమ్‌గా మాట్లాడి ఆరా తీయడం వల్ల అవినీతి కొంత మేర అయినా తగ్గుతుందని ఆలోచిస్తున్నారు. రిజిస్ర్టేషన్‌ల సమయంలో అవినీతి జరిగితే చెప్పేందుకు ప్రజలకు ఆస్కారం ఉండడంతో పాటు.. రిజిస్ర్టేషన్ల శాఖ అవినీతి నిరోధానికి కట్టుబడి ఉందన్న సంకేతాలను ప్రజల్లోకి పంపగలుగుతామని భావిస్తున్నారు.   

Updated Date - 2021-01-18T08:36:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising