ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతి ప్రచారం సమాప్తం

ABN, First Publish Date - 2021-04-16T09:55:31+05:30

తిరుపతి ఉప ఎన్నికల ప్రచార ఘట్టం గురువారం సాయంత్రంతో ముగిసింది. గతనెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది మొదలు 24 రోజుల పాటు ఉప ఎన్నికల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తరలివచ్చిన ప్రధాన పార్టీల కీలక నేతలు

బాబు, లోకేశ్‌ ప్రసంగాలకు జనం స్పందన

బీజేపీ అధ్యక్షుడు నడ్డా, పవన్‌ సభలు 

ప్రచారంలో కాంగ్రెస్‌, వామపక్షాల నేతలు 

ప్రచారానికి దూరంగా సీఎం జగన్‌.. 

మంత్రులపైనే భారం

ఉప ఎన్నికల ప్రచారం సమాప్తం


తిరుపతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల ప్రచార ఘట్టం గురువారం సాయంత్రంతో ముగిసింది. గతనెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది మొదలు 24 రోజుల పాటు ఉప ఎన్నికల ప్రచారంతో నియోజకవర్గం మార్మోగింది. పోటీలో ఉన్న ప్రధాన పార్టీలతో పాటు పోటీలో లేకున్నా మిత్రపక్షాల పేరిట రెండు పార్టీలు ప్రచారంలో పాల్గొన్నాయి. ప్రధాన పార్టీలకు సంబంధించిన కీలక నేతలంతా నియోజకవర్గానికి తరలి వచ్చారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం రాష్ట్ర ప్రధాన బాధ్యులంతా ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అధినేత జగన్‌ మాత్రమే పర్యటన ఖరారు చేసుకున్నా ఆ తర్వాత రద్దు చేసుకున్నారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 8న శ్రీకాళహస్తి నుంచి ప్రచారం ప్రారంభించి 14న సత్యవేడు సభతో ముగించారు.


కాగా, చంద్రబాబు తిరుపతి సభలో రాళ్ల దాడి జరిగి కార్యకర్తలు గాయపడడం కలకలం రేపింది. ఇక, ఎన్నికల ప్రచారానికి వైసీపీ అధినేత, సీఎం జగన్‌ దూరంగా ఉండిపోయారు. ఓ దశలో జగన్‌ పర్యటన ఖరారైనా తర్వాత రద్దు చేసుకున్నారు. దానికి కరోనా వ్యాప్తిని కారణంగా చూపించారు. అందుకు ప్రతిగా ఓటర్లకు లేఖలు రాసి వాటిని ఇంటింటికీ చేరవేసే ప్రయత్నం చేశారు. జగన్‌ రాకపోవడంతో వైసీపీ మంత్రులపైనే మొత్తం భారమంతా పడింది. 

Updated Date - 2021-04-16T09:55:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising