ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంపే హక్కు కూడా ఉంది!

ABN, First Publish Date - 2021-01-24T07:55:18+05:30

‘మాకు ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలకు అపాయం కలిగితే... చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఉద్యోగుల ప్రాణాలు ముఖ్యమైనవి
  • వ్యాక్సిన్‌ ఇస్తేనే ఎన్నికల విధులు
  • సచివాలయ ఉద్యోగ సంఘ నేత వ్యాఖ్య


విజయవాడ, జనవరి 23: ‘మాకు ప్రాణాలు ముఖ్యం. ప్రాణాలకు అపాయం కలిగితే... చంపే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీకా వచ్చేదాకా ఎన్నికల విధుల్లో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. శనివారం ఆయన ఒక చానల్‌తో మాట్లాడుతూ... ‘‘కరోనా నుంచి కాపాడేది మాస్క్‌ కాదు. టీకాయే కాపాడుతుంది. మేం అదే అడిగాం. వ్యాక్సిన్‌ ఇస్తేకానీ మేం ఎన్నికల విధుల్లో పాల్గొనం. కరోనా భయంలేని వారెవరైనా వస్తే.. వారితో ఎన్నికలు జరుపుకోండి. రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. ప్రాణాపాయం ఉంటే... చంపే హక్కు కూడా ఇచ్చింది. మనల్ని ఎవరైనా చంపడానికి వస్తే... చంపే హక్కు ఉంది’’ అని వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-01-24T07:55:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising