ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంట రాలేదనా.? అడిగింది ఇవ్వలేదనా.?

ABN, First Publish Date - 2021-12-28T14:54:37+05:30

ఎన్నికల ముందు పాదయాత్రలో తన వెంట వచ్చిన వారెవరు.. రాని వారెవ్వరు అనేది జగన్‌ బాగా గుర్తు పెట్టుకున్నారు. సినిమారంగం నుంచి మోహన్‌బాబు, అలీ లాంటివారు మినహా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నికల ముందు పాదయాత్రలో తన వెంట వచ్చిన వారెవరు.. రాని వారెవ్వరు అనేది జగన్‌ బాగా గుర్తు పెట్టుకున్నారు. సినిమారంగం నుంచి మోహన్‌బాబు, అలీ లాంటివారు మినహా జగన్‌తో ఎవ్వరూ కాలు కదపలేదు. హీరోల్లో నందమూరి బాలకృష్ణ టీడీపీ కాగా, ఎన్టీఆర్‌ కూడా అటే ఉన్నారు. మహేశ్‌బాబు బావ గల్లా జయదేవ్‌ టీడీపీ ఎంపీ, ఆయన పెదనాన్న ఆదిశేషగిరి రావు కూడా టీడీపీ వైపే ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ జనసేన అధినేత కావడంతో చిరంజీవి జగన్‌ వైపు చూడలేదు.


కృష్ణంరాజు బీజేపీ కావడంతో ప్రభాస్‌ ఆ పార్టీ జాతీయ స్థాయి పెద్దలతోనే టచ్‌లో ఉన్నారు. అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ లాంటి వారు సైతం వైసీపీ వైపు చూడక పోవడంతో తన పార్టీ వెంట ఒక్క హీరో కూడా లేడన్న కోపం జగన్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాతల్లో అశ్వినీదత్‌, సురేశ్‌ బాబు, మురళీమోహన్‌ లాంటి వారు టీడీపీతో ఉంటే, అగ్ర దర్శకులైన రాఘవేంద్రరావు, ఎస్‌ఎస్‌ రాజమౌళి, బోయపాటి శ్రీను లాంటి వారు గత టీడీపీ ప్రభుత్వ కార్యక్రమాలను ఏదో రూపంలో ప్రచారం చేశారు. జగన్‌ వైపు నాగార్జునలాంటి హీరో ఉన్నా ఆయన మాజీ కోడలు సమంత అప్పట్లో గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అనగాని సత్యప్రసాద్‌కు ప్రచారం చేయడం జగన్‌కు నచ్చలేదు. దీనికి తోడు విశాఖపట్నంలో విలువైన ఆస్తులపై వైసీపీ కన్నేసింది. అక్కడ ఆస్తులున్న కొందరు సినీ పెద్దలు ఈ విషయంలో లొంగక పోవడం కూడా వినోద రంగంపై విషం కక్కడానికి ఒక కారణంగా ప్రచారం జరుగుతోంది.  

Updated Date - 2021-12-28T14:54:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising