ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసులది రెండు నాల్కల ధోరణి

ABN, First Publish Date - 2021-01-22T09:10:27+05:30

రాష్ట్రంలో పోలీసులది రెండు నాల్కల ధోరణిలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాష్ట్రంలో అప్రకటిత అత్యవసర పరిస్థితి: సోము వీర్రాజు 


అమరావతి(ఆంధ్రజ్యోతి)/ తాడేపల్లి టౌన్‌, జనవరి 21: రాష్ట్రంలో పోలీసులది రెండు నాల్కల ధోరణిలా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. ఆలయాల ధ్వంసం అంశంలో డీజీపీ పూటకో మాట మారుస్తూ గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలోని తన నివాసంలో గురువారం గృహనిర్బంధం చేసిన పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం వీర్రాజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, అప్రకటిత అత్యవసర పరిస్థితి అమలవుతోందని విమర్శించారు. ఫిబ్రవరి 4న బీజేపీ రథయాత్ర చేసి తీరుతుందని స్పష్టం చేశారు. అంతకుముందు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లిన బీజేపీ నేతలు మాధవ్‌, ఆదినారాయణరెడ్డి, యామిని సాధినేని తదితరులను మంగళగిరి రూరల్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రాత్రికి విడుదల చేశారు. 

Updated Date - 2021-01-22T09:10:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising