ప్రభుత్వంపై ప్రజలు తిరగబడతారు
ABN, First Publish Date - 2021-10-21T10:10:05+05:30
వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. విమర్శలు చేసిన వారిపై, ప్రశ్నించిన వారిపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు.
మాజీ ఎంపీ హర్షకుమార్ ఆగ్రహం
రాజమహేంద్రవరం అర్బన్, అక్టోబరు 20: వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే పరిస్థితి త్వరలోనే వస్తుందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. విమర్శలు చేసిన వారిపై, ప్రశ్నించిన వారిపై దాడులు చేసే సంస్కృతి గతంలో ఎన్నడూ లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై విమర్శలు చేస్తారని, వాటికి సమాధానం చెప్పాలితప్ప దాడులు చేస్తారా? అని ప్రశ్నించారు. 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చే సంప్రదాయం ఎప్పుడూ లేదన్నారు. దాడి ఘటనను సీఎం జగన్ సమర్ధించుకోవడం సరికాదన్నారు.
Updated Date - 2021-10-21T10:10:05+05:30 IST