ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల కోసం సేవా విభాగాన్ని ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్

ABN, First Publish Date - 2021-05-13T00:38:18+05:30

కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు అత్యవసర సేవా విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్/ అమరావతి : కరోనా బాధితులకు అండగా ఎన్టీఆర్ ట్రస్టు అత్యవసర సేవా విభాగాన్ని ఏర్పాటు చేసింది. కరోనా బాధితులకు వైద్య సలహా నిమిత్తమై ఆన్‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకూ 592 మంది సహాయం అడగ్గా, 351 సమస్యలు పరిష్కారమయ్యాయని ట్రస్టు ఓ ప్రకటనలో పేర్కొంది. అమెరికా వైద్యులతో ఆన్‌లైన్ మెడికల్ కన్సల్టేషన్ ఇప్పిస్తున్నామని, ఇప్పటి వరకు 320 మంది కరోనా బాధితులకు ఆన్‌లైన్ సలహాలు ఇచ్చినట్లు ట్రస్టు పేర్కొంది. 185 మంది కరోనా నుంచి కోలుకునేలా సూచనలు చేశామని, మందులు కూడా అందించామని ప్రతినిధులు తెలిపారు. కరోనాతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదన్నదే తమ ట్రస్టు అభిమతమని స్పష్టం చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వ వ్యవస్థలు భరోసా ఇవ్వలేకపోతున్నాయని అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏ ఒక్కరూ ఆస్పత్రిలో చేరకుండానే కోలుకునేలా సూచనలు చేస్తున్నామని ఎన్టీఆర్ ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. 

Updated Date - 2021-05-13T00:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising