ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే పది రోజులు తేలికపాటివర్షాలే

ABN, First Publish Date - 2021-07-25T07:53:02+05:30

జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది. అవి కోస్తా, రాయలసీమలకు దూరంగా ఉన్నందున రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం?


అమరావతి, విశాఖపట్నం, జూలై 24(ఆంధ్రజ్యోతి): జార్ఖండ్‌, ఉత్తర ఛత్తీ్‌సగఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనిపై ఉపరితల ఆవర్తనం ఉంది. అవి కోస్తా, రాయలసీమలకు దూరంగా ఉన్నందున రాష్ట్రంలో వర్షాలు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రం మీదుగా పశ్చిమ, వాయవ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆగస్టు 3వరకు రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణశాఖ తెలిపింది. రానున్న 5 రోజులు ఒకటీరెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 28న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. రానున్న 48 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని వివరించింది. కాగా, శనివారం కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒకటీరెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. 

Updated Date - 2021-07-25T07:53:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising