ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కేసులపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ABN, First Publish Date - 2021-05-04T21:51:59+05:30

కొవిడ్ కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు అడిగింది. ఆక్సిజన్ అందక చనిపోతే పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ కేసులు, మరణాలు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రోజుకూ15 వేలకు పైగా కరోనా పాసిటీవ్ కేసులు రాష్ట్రంలో నమోదవుతున్నాయి. అయితే పెరుగుతున్న కరోనా కేసులపై గుంటూరుకు చెందిన సామాజిక కార్యకర్త తోట సురేష్ బాబు, ఏపీసీఎల్‌ఏ హైకోర్టులో పిల్‌ వేశారు. రాష్ట్రంలో ప్రజలకు అందుతున్న కొవిడ్ ట్రీట్‌మెంట్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. కొవిడ్ కేసులు పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు విచారించింది.


ఆక్సిజన్ అందక చనిపోతే పరిస్థితి ఏమిటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్ నియంత్రణ చర్యలపై ప్రభుత్వానికి సీజే బెంచ్‌ సూచనలు చేసింది. గత విచారణలో ప్రస్తావించిన ఆక్సిజన్, పడకలు, ఔషధాలు, కొవిడ్ పరీక్షల ఫలితాలు , వ్యాక్సినేషన్ వంటి పలు కీలకమైన అంశాలపై గంటన్నరకు పైగా హైకోర్టు విచారణ చేసింది. మృతులకు గౌరవ ప్రదంగా దహన సంస్కారాలు నిర్వహించాలని సూచించింది. గురువారం లోపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 

Updated Date - 2021-05-04T21:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising