ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభిమానులు రియాక్షన్‌ చూపించారు

ABN, First Publish Date - 2021-10-21T10:16:25+05:30

‘‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక, బీపీ పెరిగిన అభిమానులు రాష్ట్రమంతా తెలుగుదేశంపై రియాక్షన్‌ చూపించారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • నాపై తిట్లకు బీపీ పెరిగినవారి పని అది
  • టీడీపీ ఆఫీసుల విధ్వంసంపై ఏపీ సీఎం స్పందన
  • దాడుల్ని ఖండించని జగన్‌
  • బాబు, లోకేశ్‌పై వైసీపీ మంత్రులు, నేతల బూతులు


అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘‘నన్ను తిట్టే బూతులు వినలేక, తట్టుకోలేక, బీపీ పెరిగిన అభిమానులు రాష్ట్రమంతా తెలుగుదేశంపై రియాక్షన్‌ చూపించారు’’ అని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇల్లు సహా తెలుగుదేశం కేంద్ర కార్యాలయం, పలు జిల్లాల్లోని ఆ పార్టీ ఆఫీసులపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై సీఎం జగన్‌ స్పందించారు. అయితే దాడులను ఎక్కడా ముఖ్యమంత్రి ఖండించకపోవడం గమనార్హం. పైగా వాటిని సమర్థించేలా జగన్‌ ప్రతిస్పందించారు. ‘‘నన్ను బూతులు తిడతారు. నేనూ ప్రతిపక్షంలో ఉన్నాను. కానీ ఏరోజూ ఇటువంటి మాటలు ఎవరూ మాట్లాడి ఉండరు’’ అని జగన్‌ వ్యాఖ్యానించారు. అయితే జగన్‌ విపక్షంలో ఉండగా నోరుపారేసుకున్న వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చంద్రబాబును ఉద్దేశించి... ‘ఈ వ్యక్తిని నడిరోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పు లేదు’, ‘ఈ ఫోర్‌ ట్వంటీ పాలనలో..’, ‘అన్నా అనాలా లేక దున్న అనాలా’, ‘ఉరిశిక్ష వేసినా కూడా తప్పులేదు’.. ఇలా పలు సందర్భాల్లో జగన్‌ చేసిన వ్యాఖ్యలు తెరపైకి వస్తున్నాయి.


చంద్రబాబును ఉద్దేశించి కొడాలి నాని, తమ్మినేని సీతారాం, రోజా, ఇతర వైసీపీ నేతలు, మంత్రులు వాడిన బూతులు కూడా సామాజిక మాధ్యమాల్లో బయటికొస్తున్నాయి. కాగా, వైసీపీ అభిమానులు టీడీపీపై చూపించిన రియాక్షన్‌కు చంద్రబాబే బాధ్యత వహించి, క్షమాపణ చెప్పాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చేతకాని దద్దమ్మలే బూతులు వాడతారన్నారు. తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరతామని సజ్జల తెలిపారు. 


‘‘నీ తాట తీసి మా నాయకుడికి చెప్పులు కుట్టిస్తా’’: కొడాలి నాని

టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేశ్‌లను ఉద్దేశించి మంత్రి కొడాలి నాని అత్యంత పరుష పదజాలం ఉపయోగించారు. ‘‘ముఖ్యమంత్రిపై తెలుగుదేశం నేతలెవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే నీ తాట తీసి మా నాయకుడికి చెప్పులు కుట్టిస్తా’’నంటూ చంద్రబాబును ఉద్దేశించి నాని వ్యాఖ్యానించారు. మరో మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ లోకేశ్‌ను తీవ్రంగా దూషించారు. ‘‘రేయ్‌ లోకి... పగిలిపోద్ది. పప్పుగా.. చిత్తూరులో నీ అబ్బ పుట్టి ఉంటే... నీది రాయలసీమ పౌరుషం అయితే రా.. తేల్చుకుందాం’’ అంటూ లోకేశ్‌ను ఉద్దేశించి అనిల్‌కుమార్‌ అన్నారు. ‘‘లఫూట్‌గాడితో సీఎంను తిట్టిస్తారా? ఇష్టం వచ్చినట్టు తిడితే చర్మం వలిచేస్తాం. కాన్వాయ్‌ను పక్కనపెడతా, ఒంటరిగానే తిరుగుతా, రండి.. తేల్చుకుందాం’’ అని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో టీడీపీని నిషేధించాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ అన్నారు.


మరో మంత్రి కన్నబాబు మాట్లాడుతూ... పార్టీ క్యాడర్‌ను కాపాడుకునేందుకే టీడీపీ డ్రామాలు ఆడుతుందన్నారు. సీఎంపై వ్యాఖ్యలు చేస్తే వైసీపీ శ్రేణులు ఆవేశపడటంలో తప్పేముందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. ‘‘సీఎం జగన్‌పై వ్యాఖ్యలు చేసే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. ముఖ్యమంత్రిపై వ్యాఖ్యలు చేస్తే చేతులకు గాజులు తొడుక్కొని కూర్చోవాలా?’’ అన్నారు. లోకేశ్‌పై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్రంగా స్పందించారు. ‘‘దద్దమ్మను, చవటను, సన్నాసిని, ట్విటర్‌లో నాలుగు లైన్లు పెట్టే కొడుకును పెట్టుకొని చంద్రబాబు ఏమీ చేయలేక, వయసు అయిపోయి ఈ పనులన్నీ చేస్తున్నాడు’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-10-21T10:16:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising