ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ

ABN, First Publish Date - 2021-12-31T02:44:05+05:30

అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అప్పుల కోసం ఏపీ ప్రభుత్వం సరికొత్త ఎత్తుగడ వేసింది. రాజధాని అమరావతిని ప్రభుత్వం రంగంలోకి తీసుకొచ్చింది. అమరావతిలో మౌలికసదుపాయాల కల్పనకు రూ. 3 వేల కోట్ల రుణం కోసం ప్రతిపాదనలు పంపింది. డిసెంబర్‌ 14 నాటికి ఏఎమ్‌ఆర్‌డీఏ రద్దైనప్పటికీ అదే సంస్థ పేరుతో ప్రతిపాదనలను అధికారులు పంపారు. ఏఎమ్‌ఆర్‌డీఏ పేరుతో పురపాలకశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీకి ప్రతిపాదనలను ఏఎమ్‌ఆర్‌డీఏ కమిషనర్‌ పంపారు. ఇందుకోసం రూ. 3,760 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ఇందుకోసం ప్రభుత్వం వాటాగా మార్జిన్‌ మనీగా రూ. 885 కోట్లు పెట్టేందుకు ప్రతిపాదనలు పంపింది. మొత్తం రూ.3 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఫీజబిలిటీ రిపోర్ట్‌‌ను అధికారులు తయారు చేశారు. ఇందులో మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌గా 1484 కోట్ల రూపాయలను తీసుకోవాలని ప్రతిపాదనలు పంపారు. అమరావతి భూములను అమ్మి రుణం తీర్చేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు.  ఈ విధానానికి రాజధాని రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  ఏఎమ్‌ఆర్‌డీఏను రద్దు చేసిన అదే సంస్థ పేరుతో అప్పులు ఎలా తెస్తారని బీజేపీ నేత లంకా దినకర్‌ ప్రశ్నించారు.  


Updated Date - 2021-12-31T02:44:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising