ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఆంధ్రజ్యోతి’ కథనం కదిలించింది

ABN, First Publish Date - 2021-05-06T08:49:27+05:30

కరోనా మృతదేహాలను తీసుకెళ్లి దహన సంస్కారాలను చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం, మృతదేహాలను ప్రభుత్వ సిబ్బందే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిన కొవిడ్‌ తొలి దశనాటి రోజులవి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా మృతదేహాలను తీసుకెళ్లి దహన సంస్కారాలను చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు రాకపోవడం, మృతదేహాలను ప్రభుత్వ సిబ్బందే దహన సంస్కారాలు చేయాల్సి వచ్చిన కొవిడ్‌ తొలి దశనాటి రోజులవి. గత ఏడాది ఏప్రిల్‌ నెలలో నెల్లూరులో నాలుగు కరోనా మృతదేహాలను మున్సిపల్‌ ట్రాక్టర్‌లో వేసుకొని జేసీబీతో గొయ్యి తీసి ఒకే గోతిలో పాతిపెట్టారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన ఈ హృదయవిదారక ఘటన నెల్లూరు జిల్లాకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థకు చెందిన సభ్యులను కదిలించివేసింది. ఆ మరుసటి రోజు నుంచే ఈ సంస్థ సభ్యులు కరోనా మృతదేహాలకు గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు చేసే బాధ్యతను భుజానికెత్తుకున్నారు. తొలి వేవ్‌లో సుమారు 200లకు పైగా దహన సంస్కారాలు వీరి చేతుల మీదుగా జరిగాయి. రెండో విడతలో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో.. మరో సంస్థ ఆల్‌ఇండియా ఇమామ్స్‌ కౌన్సిల్‌ కూడా ముందుకొచ్చింది. పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా జిల్లా అధ్యక్షుడు సయ్యద్‌ ఖాషిఫ్‌, జిల్లా కార్యదర్శి షేక్‌ ఇమామ్‌ బాషా, ఇమామ్స్‌ కౌన్సిల్‌ జిల్లా కార్యదర్శి అఫీజ్‌ ఖలీల్‌ ముఖ్యసభ్యులు.

Updated Date - 2021-05-06T08:49:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising