ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుపతిలో ఉద్రిక్త వాతావరణం

ABN, First Publish Date - 2021-11-28T00:19:01+05:30

పట్టణంలోని క్రిష్ణానగర్‌లో కుంగుతున్న ఇంటి వద్ద ఉద్రిక్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పట్టణంలోని క్రిష్ణానగర్‌లో కుంగుతున్న ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కూల్చివేతకు గురవుతున్న ఇంటికి నష్టపరిహారంగా రూ.95 వేలు మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని తిరుపతి అర్బన్ ఎమ్మార్వో తెలిపారు. ఇల్లు కూలిస్తే ప్రభుత్వ హౌసింగ్ ద్వారా ఎంత ప్రొవిజన్ ఉంటే అంతే ఇల్లు కట్టిస్తామని ఎమ్మార్వో పేర్కొన్నారు. బాధితురాలికి అండగా ఉన్నవారు వెంటనే వెళ్ళి పోవాలని, లేదంటే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. కేసులు పెట్టినా పెట్టండి అని, బాధితులకు అండగా వారి ఇంటి ముందు రోడ్డుపైనే టీడీపీ ఇంచార్జి సుగుణమ్మ, స్థానిక మహిళలు బైఠాయించారు. 

 

 


పట్టణంలో వచ్చిన భూ ప్రకంపనల కారణంగా శ్రీ కృష్ణానగర్‌లో కుంగిన ఇంటిని కూల్చేయాలని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి సమక్షంలో మున్సిపల్ కమిషనర్ గిరీషా, అధికారులు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసుల ద్వారా బారికేడ్లు కట్టి ఇల్లు కూల్చేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధం అవుతున్నారు. అయితే తమకు తమకు న్యాయం చేసి కూల్చాలని యజమానురాలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. మూడు నెలల క్రితం 20 లక్షలు అప్పుచేసి ఇల్లు కట్టామని శేషయ్య, రాణమ్మ పేర్కొన్నారు. తన భర్త పేషెంట్ అని, బిడ్డలు నిరుద్యోగులని, ఇప్పుడు కూల్చేసి వెళ్ళిపోతే తమకు న్యాయం జరగదని వారు అన్నారు. నోటిమాటలు వద్దు, రాసి ఇవ్వాలని బాధితులు కోరుతున్నారు. ఇల్లు అమ్మి అప్పు కట్టాలని బాధితురాలు పేర్కొన్నారు. పది రోజులుగా కూలని ఇల్లు ఈ రోజు కూలిపోతుందా అని వారు ప్రశ్నించారు. తాను ఈ భవనంలో చచ్చిపోతానని శేషమ్మ బెదిరిస్తున్నారు. తమకు న్యాయం చేసి ఇంటిని కూల్చాలని బాధితులు కోరుతున్నారు. 




Updated Date - 2021-11-28T00:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising