ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-10-20T21:18:36+05:30

టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం గాయపడిన టీడీపీ సిబ్బందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. మంగళవారం గాయపడిన టీడీపీ సిబ్బందిని వైద్యులు డిశ్చార్జ్ చేశారు. గాయపడిన సిబ్బందితో పార్టీ కేంద్ర కార్యాలయం అంబులెన్స్ బయలుదేరింది. అంబులెన్స్‌ను టీడీపీ కార్యాలయం సమీపంలో పోలీసులు ఆపేశారు. అంబులెన్స్‌ను పార్టీ ఆఫీస్ లోపలకి అనుమతియించకపోవడంతో టీడీపీ నేత నారా లోకేష్ రోడ్డు ఎక్కారు. నడుచుకుంటూ వెళ్లి పోలీసులతో ఆయన గొడవకు దిగారు. లోకేష్ రంగ ప్రవేశంతో పోలీసులు వెనక్కి తగ్గారు. దీంతో కాసేపు పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు వాగ్వాదం చోటుచేసుకుంది. ఎట్టకేలకు అంబులెన్స్‌ను పోలీసులు అనుమతించలేదు.


మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసి 15 నిమిషాలు బీభత్సకాండ సృష్టించారు. ప్రధాన గేటును వాహనాలతో ఢీకొట్టి మరీ లోనికి దూసుకువచ్చారు. రాళ్లు, రాడ్లు, కర్రలతో అద్దాలు, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అడ్డువచ్చిన వారిని కర్రలు, రాడ్లతో ఇష్టం వచ్చినట్లు కొట్టారు. సుమారు 30కిపైగా వాహనాల్లో 200 మంది వరకు రౌడీమూకలు టీడీపీ కార్యాలయంలో 15 నిమిషాలకుపైగా స్వైరవిహారం చేశాయి. మూకలను అడ్డుకునేందుకు యత్నించిన కార్యాలయ సిబ్బంది బద్రి, అనిల్‌, విశాఖపట్నం డిప్యూటీ మేయర్‌ దొరబాబు, గుంటూరు టీడీపీ పార్లమెంటు వ్యవహారాల ఇన్‌చార్జి విద్యాసాగర్‌లపై దాడి చేశారు. దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వీసు రోడ్డుపై గంటపాటు రాస్తారోకో చేశారు.

Updated Date - 2021-10-20T21:18:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising