ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాస్త తగ్గిన ఎండలు

ABN, First Publish Date - 2021-04-11T09:11:04+05:30

బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశలో కోస్తా, రాయలసీమపైకి గాలులు వీస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతలో గరిష్ఠంగా 38.4 డిగ్రీలు


అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అధికపీడనం కొనసాగుతోంది. దీంతో సముద్రం నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశలో కోస్తా, రాయలసీమపైకి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రభావంతో శనివారం అనేకచోట్ల మేఘాలు ఆవరించాయి. ఉత్తర కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. కాగా శనివారం రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా ఒకటి, రెండు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అనంతపురంలో 38.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రెండు, మూడు రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగుతుందన్నారు. ఈ నెల 14 వరకు ఉత్తరాంధ్ర, యానాంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Updated Date - 2021-04-11T09:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising