ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగనన్న జాబ్ క్యాలెండర్‌పై తెలుగు యువత రియాక్షన్

ABN, First Publish Date - 2021-06-22T18:45:12+05:30

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ తెలుగు యువత..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ తెలుగు యువత  తిరుపతిలో ఆర్డీవో కార్యాలయం ముందు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందన్నారు.  భిక్షాటన చేస్తూ జగన్‌కు మంచి బుద్ధి ఇవ్వాలని వైఎస్ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.


ఈ సందర్భంగా తెలుగు యువత నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ సీఎం జగన్ నిరుద్యోగులను మభ్యపెట్టి మోసం, దగా చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తే.. ఈ రోజున ఆయన రాష్ట్రంలో యువతకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నాలుక గీసుకోడానికి కూడా పనికిరాదని అన్నారు. గతంలో రెండున్నర లక్షల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పిన ఆయన.. అధికారంలోకి వచ్చిన మూడో ఏడాదిలో 10వేలు ఉద్యోగాలు ఇస్తే.. 30 ఏళ్లకు రెండున్నర లక్షల ఉద్యోగాలు పూర్తి చేస్తారా? అని ప్రశ్నించారు. అప్పటి వరకు నిరుద్యోగులు అడుక్కుతినాలా? అని నిలదీశారు.

Updated Date - 2021-06-22T18:45:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising