ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌రెడ్డీ.. టీడీపీలో విభేదాలు సృష్టించలేవు

ABN, First Publish Date - 2021-04-14T09:23:47+05:30

‘‘నువ్వూ, నీ దొంగ మీడియా ఎన్ని తప్పుడు వీడియోలు ప్రసారం చేసినా, టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్‌రెడ్డీ!’’ అని టీడీపీ రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నీ దొంగ మీడియా వీడియోలు ఏమీ చేయవు

సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఆగ్రహం


అమరావతి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): ‘‘నువ్వూ, నీ దొంగ మీడియా ఎన్ని తప్పుడు వీడియోలు ప్రసారం చేసినా, టీడీపీలో విభేదాలు సృష్టించలేవు జగన్‌రెడ్డీ!’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు నాయకత్వంలో తిరుపతి ఉప ఎన్నికలో విజయం కోసం తామంతా ఐకమత్యంగా పని చేస్తుండటంతో జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు. ‘‘టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విసిరిన సవాల్‌కు తోక ముడిచావు. చంద్రబాబు సభపై రాళ్లేయించావు. నా సంభాషణల్ని వక్రీకరించావు. ఎన్ని విష పన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని ఆపలేవు. నారా లోకేశ్‌తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవు. నీ దొంగ మీడియా వీడియోలు ఏమీ చేయలేవు’’ అని మంగళవారం ట్విట్టర్‌ వేదికగా హెచ్చరించారు. 


భయభ్రాంతులకు గురిచేస్తారా?

సీఎం జగన్‌ రెడ్డి ప్రోద్బలంతోనే చంద్రబాబుపై తిరుపతి సభలో రాళ్ల దాడి జరిగిందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకట్రావు మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. జగన్‌ రెడ్డి ప్రోత్సాహంతోనే రౌడీ మూకలు రెచ్చిపోయి రాళ్ల దాడికి దిగాయని, ప్రజలను మెప్పించి ఓట్లు పొందడం చేతగాక ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురిచేసి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.  


స్పందన భరించలేకే దాడులు: కంభంపాటి

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో టీడీపీకి ప్రజల నుంచి వస్తున్న స్పందన తట్టుకోలేకే వైసీపీ నేతలు చంద్రబాబు సభపై రాళ్ల దాడికి పాల్పడ్డారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కంభంపాటి రామ్మోహన్‌రావు విమర్శించారు.


వివేకా హత్య కేసులో లోకేశ్‌ సవాల్‌ను స్వీకరించలేక పారిపోయిన సీఎం జగన్‌, ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఎత్తుగడలు వేస్తున్నారని దుయ్యబట్టారు. కాగా, ‘‘గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్న చందంగా ఉందయ్యా పెద్దిరెడ్డీ నీ వాలకం! చంద్రబాబుపై దాడి జరిగిందంటే.. ఆ రాళ్లు మేము విసిరినవి కావంటూ నీకు నువ్వే ప్రకటించుకోవడంతో.. నువ్వే దీని వెనుక సూత్రధారివని తెలిసిపోయింది’’ అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్వీట్‌ చేశారు. 

Updated Date - 2021-04-14T09:23:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising