ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వడ్డీతో సహా చెల్లిస్తాం: చంద్రబాబు

ABN, First Publish Date - 2021-10-29T23:11:51+05:30

టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. తన సొంత నియోజక వర్గమైన కుప్ప నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు అధికారులు, పోలీసులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు. ప్రజల కోసం పనిచేసే పార్టీ టీడీపీ అని ఆయన పేర్కొన్నారు. ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని తాము ప్రశ్నిస్తూనే ఉంటామని చంద్రబాబు తెలిపారు. అక్రమ కేసులకు టీడీపీ నేతలు భయపడరన్నారు.


కుప్పం నియోజకవర్గంలోకి రౌడీలు, గూండాలు ప్రవేశించారని ఆయన అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరాచకాలు సృష్టిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలపై మేధావులు స్పందించాలన్నారు. వైసీపీది ప్రజా ప్రభుత్వం కాదు.. దోపిడీ ప్రభుత్వమని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ నేతలకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. 




ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత దుర్మార్గం

ఏపీలో ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేత దుర్మార్గమని చంద్రబాబు అన్నారు. పాఠశాలల ఆస్తులను కాజేసేందుకే ఈ ప్రయత్నమని ఆయన ఆరోపించారు. పేద విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజావ్యతిరేకత మొదలైందన్నారు. మేం పులివెందులకు నీళ్లిస్తే.. మీరు కుప్పంకు ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని చంద్రబాబు పేర్కొన్నారు. కుప్పం ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించినా వెనుకడుగు వేయనని చంద్రబాబు స్పష్టం చేసారు. 


Updated Date - 2021-10-29T23:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising