ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుత్‌ చార్జీలపై టీడీపీ పోరుబాట

ABN, First Publish Date - 2021-10-19T08:02:13+05:30

పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం 364 గ్రామాల్లో టీడీపీ నేతలు పర్యటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 364 గ్రామాల్లో నేతల పర్యటన


అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): పెరిగిన విద్యుత్‌ చార్జీలు, ట్రూఅప్‌ చార్జీలపై తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన ‘గ్రామ స్థాయిలో పోరుబాట’ సాగుతోంది. విద్యుత్‌ చార్జీలపై నెలరోజుల ఆందోళన కార్యక్రమంలో భాగంగా సోమవారం 364 గ్రామాల్లో టీడీపీ నేతలు పర్యటించారు. కొన్ని చోట్ల ఫ్యాన్‌లను చేతిలో పట్టుకుని, జగన్‌రెడ్డి పాలనలో ఫ్యాన్లు తిరగడం లేదంటూ నిరసన తెలిపారు. విద్యుత్‌ చార్జీలు పెంచనని ఎన్నికల ప్రచార సభల్లో హామీలిచ్చిన జగన్‌ ఈ రెండున్నరేళ్లలో ఆరు సార్లు రూ.36,802 కోట్ల భారం విద్యుత్‌ వినియోగదారులపై మోపారని వారు ఆరోపించారు. నెలకు రూ.350 వచ్చే బిల్లు ఇప్పుడు రూ.1,000కి పెరిగిపోయిందన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ చార్జీలను తగ్గించడంతో పాటు ట్రూఅప్‌ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  విద్యుత్‌ చార్జీలను తగ్గించి, ట్రూఅప్‌ చార్జీలను రద్దు చేసి, డిస్కంల బకాయిలు రూ.12 వేల కోట్లు వెంటనే చెల్లించి, అధిక ధరలకు విద్యుత్‌ కొనకుండా, విద్యుత్‌ ఉత్పత్తిని పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 25 నుంచి 29 వరకు ప్రాంతీయ స్థాయిలో వినూత్న నిరసనలు తెలపాలని టీడీపీ నిర్ణయించింది.  

Updated Date - 2021-10-19T08:02:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising