ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గవర్నర్‌‌ను కలిసిన టీడీపీ నేతలు.. వైసీపీపై ఫిర్యాదు

ABN, First Publish Date - 2021-10-22T00:18:11+05:30

గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: గవర్నర్ హరిచందన్‌ను టీడీపీ నేతల బృందం కలిసింది. పార్టీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడికి సంబంధించి గవర్నర్‌కు టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ టీడీపీని అణిచివేయాలని రెండేళ్ళుగా తప్పుడు కేసులు పెట్టారన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తల ఆర్ధిక మూలాలు దెబ్బతీశారని ఆయన ఆరోపించారు. 


‘‘తెలంగాణ ఉద్యమం‌లో కూడా పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదు. గంజాయికి రాష్ట్రం కేంద్రంగా మారిపోయింది. వైసీపీ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చారు. ఇవి ప్రభుత్వం, పోలీసులు కలిసి చేసిన దాడుడు. అందుకే నిన్న బంద్, నేడు చంద్రబాబు దీక్ష. మాపై దాడి పక్కా ప్రణాళికతో జరిగింది. గవర్నర్‌ను కలిసి రెండు డిమాండ్లు పెట్టాం. రాష్ట్రపతి పాలన పెట్టాలి. సీబీఐ ద్వారా ఘటనపై విచారణ జరపాలి.’’ అని గవర్నర్‌ను కోరినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. 

Updated Date - 2021-10-22T00:18:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising