ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మేం సిద్ధం.. మీరు రెడీనా.. YSRCP కి TDP నేతల సవాల్..

ABN, First Publish Date - 2021-10-04T12:17:22+05:30

మేం సిద్ధం.. మీరు రెడీనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు జిల్లా/రేణిగుంట : ‘రేణిగుంట మండలంలో ప్రభుత్వ భూములు కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఎంపీపీ హరిప్రసాదరెడ్డి (వైసీపీ) సిద్ధమా అని టీడీపీ నాయకులు సవాల్‌ విసిరారు. అనాసాంపల్లె సర్వే నెంబరు 385లోని 31.65 ఎకరాలు ప్రభుత్వ భూములు కావా అని ప్రశ్నించారు. మండలంలో వైసీపీ నాయకుల భూదందాలపై ఎంపీపీని విచారించడానికి కలెక్టర్‌ ఆదేశించాలని డిమాండు చేశారు. 


రేణిగుంటలో ఆదివారం వీరు మీడియాతో మాట్లాడారు. అనాసాంపల్లె రెవెన్యూ లెక్కదాఖలాలోని సర్వేనెంబరు 634లో 3.82 ఎకరాలు, 368లో 50సెంట్లు, 335/1లో 4.66 ఎకరాలు, సీసీఎల్‌ఏల్‌కు సంబంధించిన న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తున్నా.. కబ్జాచేసి రైతువారి పట్టాకోసం ప్రయత్నం చేశారన్నారు. 338/1,2లో 5.58ఎకరాలు కబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. తిరుపతి అర్బన్‌ మండలం చెన్నాయగుంట రెవెన్యూ లెక్కదాఖలా సర్వేనెంబరు 222లో 8.33 ఎకరాల్లో ప్లాట్లువేసి విక్రయించే ప్రయత్నించారని ఆరోపించారు. అలాగే 218, 219లోని చెక్‌డ్యామ్‌ను పూడ్చి ప్లాట్లు వేశారని, వెంకటాపురం రెవెన్యూ లెక్కదాఖలాలోని 261/4లో 6.5 ఎకరాల చెరువు భూమిని కబ్జాచేసి అమ్మే ప్రయత్నం చేసేదీ వైసీపీ నాయకులేనని ఆరోపించారు. తమపై పెట్టిన తప్పుడు కేసులను రద్దు చేయకుంటే ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు.


కాగా, మర్రిగుంట చెరువు కట్టకు మరమ్మతులు చేస్తే చెరువులో ఇంటి స్థలాలు నాయకులు అమ్ముకున్నారని, ఇప్పుడు ఆ ఇళ్లలోకి రావా అని సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రశ్నించారు. తాను పది ఎకరాలు కబ్జా చేసినట్లు ఎంపీపీ నిరూపిస్తే రూ.పది లక్షలు పారితోషికం ఇస్తానని లేకుంటే ఆయన రాజీనామా చేయాలని మునస్వామినాయుడు సవాల్‌ విసిరారు. తాము భూఆక్రమణలకు పాల్పడినట్లు కాణిపాకంలో ప్రమాణం చేయాలని బుజ్జినాయుడు డిమాం డ్‌ చేశారు. భూకబ్జాలపై విచారణ జరపమంటే పురుషోత్తంరెడ్డి భుజాలు తడుముకొంటున్నారని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. వైసీపీ నేతల భూదందాలపై ఆధారాలతో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తామని టీడీపీ టౌన్‌ అధ్యక్షుడు మహబూబ్‌బాషా హెచ్చరించారు. జగనన్న పట్టాల పంపిణీపై విచారణ జరిపించాలని నాదమునిరెడ్డి డిమాం డ్‌ చేశారు. ఈ సమావేశంలో మురళి, అఫ్రూద్‌, చెంగయ్య తదితరులు నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-04T12:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising