ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో ఆక్రమణల తొలగింపు... మాజీ ఎమ్మెల్యే పల్లా నిర్మాణాలంటూ పుకార్లు

ABN, First Publish Date - 2021-06-13T14:35:53+05:30

వీఎంసీ పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గాజువాక ఆటోనగర్ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖపట్నం : జీవీఎంసీ పరిధిలో ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగిస్తున్నారు. గాజువాక ఆటోనగర్ సమీపంలో, ఇతర ప్రాంతాల్లో అధికారులు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టారు. టీడీపీ విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షుడు, గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు భూములకు సమీపంలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకెళితే.. తుంగలంలో 12.5 ఎకరాలు, జగ్గరాజుపేటలో 5 ఎకరాల భూమిని జీవీఎంసీ స్వాధీనం చేసుకుంది. భారీ పోలీసుల బలగాల మధ్య ఆక్రమణలను రెవెన్యూ, జీవీఎంసీ సిబ్బంది కూల్చివేస్తున్నారు. అయితే పల్లా భూములు స్వాధీనం చేసుకున్నారంటూ పుకార్లు పుట్టాయి.


కాగా.. డీపీ గత కొన్ని నెలలుగా విశాఖలో ఆక్రమణల తొలగింపు వేగవంతం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పలువురు టీడీపీ సీనియర్ నాయకుల నిర్మాణాలను సైతం అధికారులు కూల్చివేసిన ఘటనలు అప్పట్లో సంచలనమయ్యాయి. ఏప్రిల్ నెలలో పల్లా శ్రీనివాసరావుకు చెందిన భవనాన్ని జీవీఎంసీ కూల్చివేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. 

Updated Date - 2021-06-13T14:35:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising